మహేష్ స్పెషల్ రోల్ కు గట్టి గ్రౌండ్ వర్కే చేశారట.!

Published on Feb 23, 2021 10:00 am IST

ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా “సర్కారు వారి పాట” అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ మాస్ ఎంటర్టైనెర్ ను దర్శకుడు పరశురామ్ పెట్ల అవుట్ స్టాండింగ్ అవుట్ ఫుట్ తో మహేష్ కెరీర్ లోనే సరికొత్త ఎక్స్ పీరియెన్స్డ్ చిత్రంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రంపై మాత్రం అనుకున్న అంచనాలకు మించే ఉండేలా ఉందని టాక్ వినిపిస్తుంది.ముఖ్యంగా మహేష్ రోల్ కు సంబంధించి ఎప్పటి నుంచో మంచి ఆసక్తికర విషయాలే వినిపించాయి.

మహేష్ డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ ఫైనాన్సియర్ రోల్ లో మహేష్ అదరగొట్టనున్నాడని మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుంది. అలాగే పలు స్కామ్స్ చుట్టూతా మహేష్ రోల్ అవుట్ అండ్ అవుట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అని అంతే కాకుండా దర్శకుడు ఈ రోల్ కు గాను చాలానే గ్రౌండ్ వర్క్ చేశారట.

నిజ జీవితంలో కూడా కొంతమంది మనీ లెండర్స్ ను కలిసి మహేష్ రోల్ ను పరశురామ్ రాసుకున్నారని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పరశురామ్ యాక్షన్, పాటలు నుంచి ప్రతీ విషయంలోను చాలా జాగ్రత్తగా ఉన్నారని చెప్పాలి. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :