ఆంధ్రా మొత్తం చుట్టేస్తున్న ‘ప్రతిరోజూ పండుగే’ టీం !

Published on Dec 10, 2019 12:27 am IST

సినిమా తీయడం ఎంత ముఖ్యమో దానిని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఇప్పుడు హీరోలు మరియు దర్శక నిర్మాతలు బలమైన సోషల్ మీడియా ద్వారానే కాకుండా అనేక మార్గాల ద్వారా విడుదలకు ముందు తమ సినిమా తెలిసేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన ప్రతిరోజూ పండుగే చిత్ర ప్రచారం భారీగా నిర్వహిస్తున్నారు. గత కొద్దిరోజులుగా చిత్ర యూనిట్ ఆంధ్రా మొత్తం తిరిగి అభిమానులను కలుసుకుంటున్నారు.

వైజాగ్, ఉభయ గోదావరి జిల్లాలు ఇలా ఆంధ్రాలో అనేక ప్రాంతాలలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రతిరోజు పండుగే టీం ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకుల నుండి ఘనస్వాగతం లభిస్తుంది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తూ ఉండగా థమన్ సంగీతం అందించారు. ఈనెల 20న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More