సెన్సార్ ను పూర్తిచేసుకున్న ‘పరిచయం’ !

సెన్సార్ ను పూర్తిచేసుకున్న ‘పరిచయం’ !

Published on Jul 17, 2018 11:29 AM IST


నూతన దర్శకుడు లక్ష్మీకాంత్ చిన్న దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రాత్ కౌర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘పరిచయం’. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకొని ‘U/A’ సర్టిఫై తో ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఇటీవలే డైరెక్టర్ మారుతి ముఖ్య అతిధిగా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరుపుకుంది. హీరో నితిన్ ట్రైలర్ విడుదల చేయగా, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ పరిచయం ట్రైలర్ చాలా బాగుందని ట్వీట్ చేశారు. ఇలాంటి ప్రముఖులు ‘పరిచయం’ చిత్రబృందాన్ని అభినందించడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఆసిన్ మూవీ క్రెయేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు