పరశురామ్ చేతుల మీదుగా విడుదలైన ‘ అనగనగా ఓ ప్రేమకథ లోని ‘ఒక తొలిప్రేమ’ పాట !

పరశురామ్ చేతుల మీదుగా విడుదలైన ‘ అనగనగా ఓ ప్రేమకథ లోని ‘ఒక తొలిప్రేమ’ పాట !

Published on Oct 16, 2018 12:30 PM IST

parasuram1
‘అనగనగా ఓ ప్రేమకథ ‘ చిత్రంలోని ‘ఒక తొలిప్రేమ ‘ సాంగ్ ను ప్రముఖ దర్శకుడుపరశురామ్ ఈరోజు ఉదయం విడుదల చేశారు. అనంతరం చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాట కు సమకూర్చిన సంగీతం, సాహిత్యం ఎంతో బాగున్నాయన్నారు. హీరో అశ్విన్ బాగా చదువుకున్నవాడు. వినయ విధేయతలు కలిగినవాడు. చిత్రం టీజర్ ను చూసాను. ఎంతో ప్రామిసింగ్ గా ఉంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు గారు పరిశ్రమలోని అందరికీ కావలసిన వ్యక్తి. ఆయన చేసిన ఈ ప్రయత్నం మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను అన్నారు.

షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపు కుంటోంది. త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతున్నాడు. టి.ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు. కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (టిల్లు) తదితరులు నటిస్తున్నారు.

తాజా వార్తలు