మెగాడాటర్స్ పాస్ ది బ్రష్ ఛాలెంజ్..వైరల్ అవుతున్న వీడియో..!

మెగాడాటర్స్ పాస్ ది బ్రష్ ఛాలెంజ్..వైరల్ అవుతున్న వీడియో..!

Published on Apr 23, 2020 10:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ రియల్ మెన్ ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. ఆ ఛాలెంజ్ లో భాగంగా ఇంటి పనులలో పాల్గొంటూ తమ భార్యలకు పనులలో చేదోడు వాదోడుగా ఉంటూ, రియల్ మెన్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఛాలెంజ్ ఇండస్ట్రీలో చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి నెరవేర్చారు. అలాగే వీరు, మహేష్, వరుణ్ , బాలకృష్ణ, నాగార్జున వంటి వారిని ఈ ఛాలెంజ్ కి నామినేట్ చేయడం జరిగింది. వారి వీడియోస్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఒక ప్రక్క రియల్ మెన్ ఛాలెంజ్ నడుస్తుంటే మెగా ఫ్యామిలీ డాటర్స్ పాస్ ది బ్రష్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. చిరంజీవి కూతుళ్లు అయిన శ్రీజ, సుస్మిత నాగబాబు కూతురు నిహారిక లతో పాటు బన్నీ వైఫ్ స్నేహారెడ్డి లతో పాటు కొందరు ఈ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. వినూత్నంగా ఉన్న ఈ పాస్ ది బ్రెష్ వీడియోలో గ్రేసీ మూమెంట్స్ తో మెగా డాటర్స్ అల్లాడించారు.

https://www.instagram.com/p/B_UAl1zp5mm/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు