12కోట్లు సాధించిన ‘పటాస్’

12కోట్లు సాధించిన ‘పటాస్’

Published on Feb 4, 2015 1:13 AM IST

patas
కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమా భారీ విజయం సాధించింది. విడుదల అన్ని చోట్లా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్ లతో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఎంటర్టైనర్ ఆంధ్రా, తెలంగాణా ప్రాంతాలు కలిపి 12కోట్ల మార్కుని అందుకుంది.

కళ్యాణ్ రామ్ పాత్ర చిత్రీకరణ కధను ఫాస్ట్ గా తెరకెక్కించిన విధానం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. శృతి సోధి హీరోయిన్. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.

తాజా వార్తలు