యుఎస్ లోనూ మంచి కలెక్షన్స్ చేసిన ‘పటాస్’

patas-movie-review
నందమూరి కళ్యాణ్ రామ్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న సూపర్ హిట్ ‘పటాస్’ రూపంలో వచ్చింది. దాంతో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతని టీం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఫ్యాన్స్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో పటాస్ విడుదలైన అన్ని చోట్లా హౌసె ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. అలాగే రెండవ రోజు నుంచే ఈ సినిమా థియేటర్స్ ని కూడా పెంచారు. వీటన్నిటికి తోడు లాంగ్ వీకెండ్ తోడవడంతో ఆంధ్ర, తెలంగాణాలో కలయన్ రామ్ కెరీర్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి.

యుఎస్ లో కూడా కళ్యాణ్ రామ్ పటాస్ కి మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. యుఎస్ విడుదలైన 18 స్క్రీన్స్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మొదటి మూడు రోజుల్లో $105,848 డాలర్స్ ని కలెక్ట్ చేసింది. తక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి మొదటి వీకెండ్ ఇంతమంచి కలెక్షన్స్ సాధించడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. మొదటి వారంలో మంచి కలెక్షన్స్ నమోదవుతాయని ఆశిస్తున్నారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎంటర్ టైన్మెంట్ గా సాగడం ఈ సినిమాకి ప్రధాన బలం. శృతి సోది హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version