పవన్, క్రిష్ ల టార్గెట్ అప్పటికి ఫిక్స్ అయ్యిందా.?

Published on Jan 2, 2021 2:00 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులలో స్పెషల్ సినిమా క్రిష్ జాగర్లమూడి తో తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రమే అని చెప్పాలి. శ్రీరామ్ వేణుతో “వకీల్ సాబ్” లైన్ లో ఉండగానే ఈ సినిమాకు సైన్ చేశారు. అలాగే ఈ సినిమా కోసం మరిన్ని విషయాలు తెలుసుకున్న ఫ్యాన్స్ దీనిపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

అయితే కేవలం కొన్ని రోజులే షూట్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇంకా చాలా మేర బ్యాలెన్స్ ఉంది. మరి దానికి పవన్ కూడా ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసారు. ఆ టైం లో ఈ చిత్రాన్ని క్రిష్ పూర్తి చేసేయాలని ప్లాన్స్ గీస్తున్నారు. మరి అలాగే ఈ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ ను ఎప్పటికి రిలీజ్ చెయ్యాలి అన్నది కూడా తెలుస్తుంది. ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ దసరా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :