స్పెషల్ లుక్ కోసం వర్కౌట్ చేస్తున్న పవన్ కళ్యాణ్

pawan-kalyan
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఓ స్టార్ మాత్రమే కాదు, అదొక ప్రభంజనం అని చెప్పాలి. పవన్ ఏం చేసినా ఓ సెన్సేషన్ అయిపోతోంది. పవన్ రాజకీయ ప్రస్తావన పెక్కన పెట్టి సినిమాల విషయంలోకి వస్తే.. పవన్ ఎప్పుడెప్పుడు సినిమా చేస్తాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కోసమే ఆయన ఇటీవలే ‘గబ్బర్ సింగ్ 2’ సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసాడు. జూలై చివరి వారం నుంచి మొదలు కానున్న 40 రోజుల షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవుతాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడా అనే విషయాన్ని ఆయన సన్నిహితుల ద్వారా తెలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగుళూరు లో ఉంటూ తన బ్యాక్ పెయిన్ కి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే డైలీ జిమ్ లో టైం గడుపుతూ ఫిజికల్ గా కూడా మంచి ఫిజిక్ కోసం వర్కౌట్ చేస్తున్నాడు. గబ్బర్ సింగ్ 2 కోసం స్లిమ్ గా తాయరవ్వడమే కాకుండా బాడీని కూడా పర్ఫెక్ట్ గా షేప్ తీసుకువస్తున్నాడని సమాచారం. ఇది కాకుండా పవన్ ఈ మధ్య ఫుల్ గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో గడ్డంతో ఓ స్టైలిష్ లుక్ కూడా ఉంటుందని అంటున్నారు.

పవర్ డైరెక్టర్ బాబీ అలియాస్ కెఎస్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ డైరెక్టర్. శరత్ మరార్ నిర్మించనున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

Exit mobile version