ఆ కారణంగా పవన్ రీఎంట్రీ ని ఎంజాయ్ చేయలేకపోతున్న ఫ్యాన్స్.

Published on Dec 13, 2019 8:04 pm IST

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత రాత్రి సినీ అభిమానులకు బిగ్ సర్పైజ్ ఇచ్చారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో 40వ చిత్రంగా పింక్ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించారు. దానితో పాటు థమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేస్తున్నట్లుగా దర్శకుడు వేణు శ్రీరామ్ మరియు థమన్ లతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ప్రకటనలో ఆయన ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించనప్పటికీ చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిచనున్నట్లు వార్తలు రావడంతో పాటు, ఇండస్ట్రీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఇది పవన్ చేస్తున్న ప్రాజెక్ట్ అనే ధ్రువీకరించడం జరిగింది. దీనితో పవన్ ఫ్యాన్స్ నిన్నటి నుండి సెలబ్రేషన్ మూడ్ లోకి వెళ్లిపోయారు. దిల్ రాజు ఈ వార్త ప్రకటించిన గంటల వ్యవధిలో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ట్విట్టర్ లో ఈ చిత్రంపై విపరీతమైన చర్చ జరిగి ట్రెండింగ్ లో కొనసాగింది.

ఐతే పవన్ రీఎంట్రీ ని అనేక మంది అభిమానులు స్వాగతిస్తున్నప్పటికీ ఆయన రీఎంట్రీ కొరకు ఎంచుకున్న సినిమానే వారిని అసహనానికి గురిచేస్తుంది. పింక్ సినిమాలో హీరోయిజం ఎలివేషన్ కి అంత ఆస్కారం ఉండదు. పింక్ మూవీ పూర్తిగా సోషల్ కాన్సెప్ట్ కలిగిన కథ. ఐతే పవన్ కోసం స్క్రిప్ట్ కొన్ని మార్పులు చేసినప్పటికీ పవన్ ఇమేజ్ కి సరిపోదని వారి అభిప్రాయం. అందుకే సోషల్ కంటెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టు తో పవన్ మూవీ చేస్తే బాగుండు అని వారు భావిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న పింక్ రీమేక్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :

X
More