రామ్ చరణ్‌తో తప్పక సినిమా నిర్మిస్తానంటున్న పవన్

Published on Dec 15, 2019 10:48 am IST

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆయన చేస్తారని చెప్పుకుంటూ వచ్చిన హిందీ సినిమా ‘పింక్’ తెలుగు రీమేక్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. అయినా పవన్ ఇంకా తన తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. అయితే నిర్మాతగా మారడం పట్ల మాత్రం పవన్ స్పష్టంగానే ఉన్నారు. తాను హీరోగా సినిమాలు చేయలేను కాబట్టి సినిమాలు నిర్మిస్తానని, అదే తన ఆదాయ వనరని పవన్ గతంలోనే చెప్పారు.

ఇప్పుడు కూడా ఆయన అదే మాటమీదున్నారు. తన అన్న కుమారుడు, హీరో రామ్ చరణ్‌తో తప్పకుండా సినిమా నిర్మిస్తానని అంటున్నారు. అయితే కథ, డైరెక్టర్ ఇంకా కుదరలేదు కాబట్టి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. సో.. పవన్ మాటల్ని బట్టి అన్నీ కుదిరితే ఆయన నిర్మాణంలో చరణ్ నటించడం త్వరలోనే సాధ్యపడుతుందని అనిపిస్తోంది. ఇకపోతే చరణ్ ప్రెజెంట్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More