
ఇపుడు మన ఇండియన్ సినిమా దగ్గర మెయిన్ గా సౌత్ నుంచి అయితే పలు క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ లు అయితే ఊపందుకున్నాయి. ఇక ఈ లిస్ట్ లో అయితే లేటెస్ట్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ కూడా తోడవుతుందా? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్న సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో కేజ్రీగా మారిపోయింది.
అయితే సుజీత్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “ఓజి” అనే ఓ పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామా చేస్తున్నాడు. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ పిక్ సోషల్ మీడియాని మూవీ లవర్స్ ని కుదిపేసింది. ఇందులో ‘వాజి ఇంపోర్ట్స్’ అనే ఒక గోడౌన్ కనిపిస్తుంది. అయితే ఇది చూసినవారు అందరికీ ఒక్కసారిగా చిన్న రివైండ్ అయితే పడింది.
గత 2019 లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ చిత్రం “సాహో” లో వాజి సిటీ కోసం అక్కడ ఉండే పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్స్ కోసం ప్రస్తావన వస్తుంది. దీనితో ఓజి లో వాజి కి సాహో లో వాజి కి సంబంధం ఉందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు పైగా స్పెలింగ్ కూడా ఒకేలా ఉంది. వీటిలో అయితే సుజీత్ యూనివర్స్ కూడా స్టార్ట్ అయ్యిందా మరి ఫ్యూచర్ లో అయితే పవన్ – ప్రభాస్ లని ఒకే సినిమాలో చూస్తామా అనే ఊహకందని ప్రశ్న ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఒకవేళ ఇది కనుక నిజం అయితే మాత్రం అదెలా ఉంటుందో ఫ్యాన్స్ ఊహలకే వదిలేయవచ్చు.