ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ తో స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓ ప్రత్యేక ఇమేజ్ ఉంది. తను మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తన నటన, తన వ్యక్తిత్వంతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఆలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు. పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి నేటికి 19 ఏళ్ళు ముగిసింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయి’ సినిమా అక్టోబర్ 11 1996లో రిలీజ్ అయ్యింది. అనగా ఆ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 19 సంవత్సరాలు పూర్తయ్యింది.
స్వర్గీయ ఇవివి సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ హీరోయిన్ గా కనిపించగా, అల్లు అరవింద్ నిర్మించాడు. మొదటి సినిమాలోనే రియల్ స్టంట్స్ ఎన్నో చేసి ప్రేక్షకులకు తనవైపు తిప్పుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, సుశ్వాగతం సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటే ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ సినిమా పవన్ కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ లోనే ఓ సరికొత్త ప్రేమకథకి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమా పవన్ కి టాలీవుడ్ లో ఓ ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరిచింది. ఆ తర్వాత కొద్ది రోజులు పవన్ కి సరైన హిట్స్ లేకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అస్సలు తగ్గలేదు.. గబ్బర్ సింగ్ మరియు అత్తారింటికి దారేది సినిమాలతో పవన్ కలయన ఇండస్ట్రీ టాప్ గ్రాసర్ సినిమాలను అందించాడు. ఈ 19ఏళ్ళ కెరీర్లో 21 సినిమాల్లో నటించిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.


