మరో సినిమాకి పవన్ అంగీకరించాడా ?

Published on Jul 25, 2021 9:55 pm IST

నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయడానికి అంగీకరించాడని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్, దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం దిల్ రాజు పవన్ కోసం మంచి కథను, అలాగే ఒక టాలెంటెడ్ డైరెక్టర్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారట.

నిజానికి పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఆ మధ్య ఒక కథ రాసాడట. ఆ కథతోనే సినిమా చేయాలనే ఆలోచన కూడా ఉందట. కాకపోతే ఇంకా దర్శకుడిని మాత్రం ఫైనల్ చేయలేదని.. దిల్ రాజు ఫైనల్ చేసాక, పవన్ కూడా ఓకే అనుకుంటే అప్పుడు ఆ దర్శకుడి పేరుని అధికారికంగా ప్రకటిస్తారట.

వకీల్ సాబ్ షూట్ సమయంలో కూడా పవన్ కి అనుగుణంగా షూటింగ్ ప్లాన్ చేశాడు దిల్ రాజు. అందుకే పవన్ కూడా మళ్ళీ దిల్ రాజుతో సినిమా చేయాలని ఆసక్తి చూపించాడు.

సంబంధిత సమాచారం :