పవన్ బండ్ల గణేష్ సినిమా పై పెరుగుతున్న అంచనాలు!

Published on Jul 11, 2021 9:44 pm IST

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కి మంచి కమ్ బ్యాక్ ను ఇవ్వడం మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ చిత్రం తో సూపర్ హిట్ సొంతం చేసుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు మరియు హరీష్ శంకర్ తో మరొక చిత్రం చేస్తున్నారు. అంతేకాక శేఖర్ చంద్ర దర్శకత్వం లో అయ్యప్పన్ కోషియం రీమేక్ లో నటిస్తున్నారు పవన్.

అయితే బండ్ల గణేశ్ నిర్మాతగా మరొక చిత్రాన్ని చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం మరొక బ్లాక్ బస్టర్ విజయం అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి ఇంకా దర్శకుడు ఫిక్స్ కాలేదు. అయినప్పటి కి ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :