అరడజన్ అప్డేట్స్‌తో పవన్ అభిమానులు గుక్కతిప్పుకోలేరా..!

Published on Aug 14, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు త్వరలో అతిపెద్ద పండుగ రాబోతుంది. సెప్టెంబర్ 2వ తేదిన పవన్ పుట్టిన రోజు వస్తుండడంతో ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత వకీల్ సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ అర డజన్‌కి పైగా సినిమాలను లైన్‌లో పెట్టాడు. పవన్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు ఖచ్చితంగా ఈ సినిమాల నుంచి ఏదో ఒక అప్డేట్స్ అయితే రావడం గ్యారంటీ అని అభిమానులు ఫుల్ జోష్ మీద ఉన్నారు.

అయితే మొదటగా చూసుకుంటే పవన్ హీరోగా రానా దగ్గుబాటితో కలిసి సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో చేస్తున్న #ఫ్శ్ఫ్ఖృఅన చిత్రానికి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ ను ఆగస్టు 15న విడుదల అవుతున్నట్టు తాజాగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఇదివరకే ప్రకటించగా, సెప్టెంబర్ 2న ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయబోతున్నారు.

ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ హీరోగా చేస్త్గున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి ఓ అప్డేట్ రాబోతుండగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో #ఫ్శ్ఫ్ఖ్28 సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా నుంచి కూడా ఓ పోస్టర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉండగా, బండ్ల గణేష్-భగవాన్-పుల్లారావు నిర్మాణంలో వస్తున్న సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఇన్ని అప్డేట్స్ ఒకేసారి వస్తే పవన్ అభిమానులు గుక్కతిప్పుకోలేరేమోనని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :