వైరల్ అవుతున్న పవర్ స్టార్ లుక్ అప్పటిదేనా.?

Published on Sep 22, 2020 8:00 am IST

ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలకు సంబంధించి లేటెస్ట్ లుక్ కు సంబంధించిన పిక్స్ కానీ లేదా తాము నటించిన ముందు చిత్రాలకు సంబంధించి కొన్ని అన్ సీన్ పిక్స్ కానీ సోషల్ మీడియాలోకి వచ్చి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలా ఇపుడు లేటెస్ట్ గా టాలీవుడ్ మరో స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఫోటో ఒకటే బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నెరసిన గడ్డం మరియు షార్ట్ హెయిర్ తో చిన్నగా స్మైల్ ఇస్తూ ఉన్న పవన్ ఫోటో ఇపుడు బయటకొచ్చింది. దీనితో ఈ స్టిల్ ఏ ఏడాదిలోనిది అన్న ప్రశ్న మొదలయ్యింది. సరిగ్గా గమనిస్తే పవన్ ఈ మధ్య కాలంలోనే కాక గత మూడునాలుగేళ్లలోనే అంత షార్ట్ హెయిర్ లుక్ తో అయితే లేరు.

మరి బహుశా అది “కొమరం పులి” టైం లోది కావచ్చు. మరి అలా అయినా సరే అప్పటికే పవన్ లుక్ అలా మారిపోయిందా అంటే అదీ అనుమానమే కానీ లుక్ మాత్రం అప్పటిదాని లానే ఉంది అయితే హాఫ్ హ్యాండ్స్ షర్ట్స్ అయితే ఆ టైం లోనే పవన్ వేసింది ఉంది. మొత్తానికి మాత్రం ఈ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

సంబంధిత సమాచారం :

More