పవర్ స్టార్ ముందుగానే అడుగేయనున్నాడా?

Published on Sep 22, 2020 11:05 pm IST


ప్రస్తుతం పవర్ పవన్ కళ్యాణ్ అండర్ లో ఉన్న ప్రాజెక్టులలో మొట్ట మొదటిది “వకీల్ సాబ్” దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు కంప్లీట్ అయ్యిపోయినట్టే. తాజాగా మిగిలి ఉన్న చిన్న పాటి బ్యాలన్స్ షూట్ ను కూడా చిత్ర యూనిట్ మొదలు పెట్టేసారు.

అయితే ప్రస్తుతానికి పవన్ లేని సన్నివేశాలను చిత్రీకరించి తర్వాత పవన్ పై షూట్ చేయనున్నారు. అయితే పవన్ తాను డిసెంబర్ లో షూటింగ్స్ కు పాల్గొంటానని చెప్పారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ మాత్రం వచ్చే నెలలో కానీ నవంబర్ లో కానీ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా టాక్ వినిపిస్తుంది.

ఎలాగో అన్ని చిత్రాలు షూటింగ్స్ మొదలయ్యిపోతున్నాయి. అలా పవన్ కూడా తొందరగానే అడుగేసి ముగించేయాలని అనుకుంటున్నారట. అలాగే ఈ షూట్ లో పవన్ కు ఫీమేల్ లీడ్ లో ఎంపిక చేసిన శృతి హాసన్ కూడా పాల్గొనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ చిత్రం “పింక్”కు రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే అంజలి, నివేతా థామస్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :

More