గాయపడిన చిన్నారులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

pawan-kalyan

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ లో గల యశోదా హాస్పిటల్ వద్ద భాదిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం ఉదయం మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రైలు – బస్సు ప్రమాదంలో 20 మంది చిన్నారులు మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు. గాయపడిన చిన్నారులకు యశోదా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.

ఈ హృదయ విషాదకర వార్త తెలియగానే పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఆ చిన్నారులను, వారి తల్లిదండ్రులను పరామర్శించడం కోసం పవన్ హాస్పిటల్ కు విచ్చేశారు. భాదిత కుటుంబాలకు పవన్ తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. గాయపడిన పిల్లల తల్లిదండ్రుల నుంచి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. భవిష్యత్లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version