మళ్ళీ విజయ్ సినిమాపై పవన్ సినిమా ఎఫెక్ట్!

మళ్ళీ విజయ్ సినిమాపై పవన్ సినిమా ఎఫెక్ట్!

Published on May 2, 2025 8:02 AM IST

kingdom harihara veeramallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణతో చేస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఇలా గత మార్చ్ 28 నుంచి ఈ మే 9కి వాయిదా పడ్డ ఈ చిత్రం మళ్ళీ ఈ మే 9 నుంచి నెలాఖరుకు వాయిదా పడినట్టుగా టాక్ వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉండగా మళ్ళీ ఈ వాయిదాతో ఎఫెక్ట్ విజయ్ దేవరకొండ భారీ చిత్రం “కింగ్డమ్” పైనే పడినట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ హరిహర వీరమల్లు గాని మే చివరికి ఫిక్స్ అయ్యితే కింగ్డమ్ వాయిదా పడే ఛాన్స్ ఉందట. దీనితో కింగ్డమ్ ఫేట్ వీరమల్లు పై ఆధారపడి ఉందని చెప్పాలి. అయితే పవన్ నుంచి డేట్స్ ఇంకా రాకపోవడంతో బాలన్స్ షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు