పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా చాలా కాలం అనంతరం వస్తున్న సినిమా కావడమే స్పెషల్ కాకుండా ఇందులో పవన్ లుక్స్ కూడా ఇప్పుడు మరింత స్పెషల్ అండ్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.
ఎందుకంటే బహుశా ఇంతకు ముందు పవన్ ఎప్పుడు కనిపించని విధంగా పవన్ ఈ సినిమాకు ప్రిపేర్ అయ్యారు. మొత్తం మూడు షేడ్స్ లో ఈ చిత్రానికి పవన్ రెడీ అవ్వడం స్పెషల్ గా నిలిచింది. మొదటగా షూట్ లో పాల్గొన్న సమయంలో ఫుల్ గా గడ్డం లుక్ లో అలాగే ఆ తర్వాత మళ్ళీ ట్రిమ్డ్ లుక్ లోకి లేటెస్ట్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు గాను క్లీన్ షేవ్డ్ లుక్ లోకి వచ్చి కనిపించారు. దీనితో ఈ చిత్రంలో పవన్ లుక్స్ ఇప్పుడు స్పెషల్ మెన్షన్ గానే నిలిచాయని చెప్పాలి.


