‘ఓజి’ క్రేజ్ కి ఇది మరో నిదర్శనం.. ఇదేమి మాస్ రీచ్!

‘ఓజి’ క్రేజ్ కి ఇది మరో నిదర్శనం.. ఇదేమి మాస్ రీచ్!

Published on Jun 12, 2026 12:13 PM IST

OG

తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న భారీ ఫాలోయింగ్ కోసం కానీ క్రేజ్ కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనకి సరైన సినిమా పడితే దాని ప్రభావం ఎలా ఉంటుందో తన సినిమా ‘ఓజి’ చూపించింది. దర్శకుడు సుజీత్ తో చేసిన ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ వచ్చి భారీ ఓపెనింగ్స్ రాబట్టింది.

అయితే కంటెంట్ కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉండి ఉంటే మరింత లెవెల్లో వసూళ్లు వచ్చి ఉండేవి కానీ అభిమానులు పూర్తిగా ఈ సినిమాకి తమ హీరో పేరిట ప్రతీ రూపాయి అందించారు. అయితే పవన్ చేస్తున్న చేయనున్న సినిమాల అన్నీ ఒకెత్తు అయితే ఒక్క ఓజి క్రేజ్ మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా ప్రొడక్షన్ సంస్థల నుంచి చిన్నపాటి అప్డేట్ ఓజి పై వచ్చినా టీం మాట్లాడినా సోషల్ మీడియాలో దీని రీచ్ ఊహించని లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మొన్నామధ్య డీవీవీ సంస్థ జస్ట్ చిన్న ట్వీట్ చేస్తేనే మిలియన్స్ ఇంప్రెషన్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ పవన్ నిర్మాణ సంస్థ నుంచి ఆకస్మికంగా వచ్చిన ఓజి 2 అప్డేట్ సోషల్ మీడియాని షేక్ చేసి పారేసింది. ఇలా ఓజి క్రేజ్ మాత్రం మామూలు లెవెల్లో కొనసాగడం లేదని చెప్పాలి. ఇక మేకర్స్ ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ అందిస్తారో చూడాలి.

తాజా వార్తలు