పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓజి’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్‌ను మేకర్స్ అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో ఒక్కసారిగా ఈ మూవీపై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే మేకర్స్ ‘ఓజి యూనివర్స్’ అనౌన్స్ చేయగా.. పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ మధ్య జరిగిన ఒక క్రియేటివ్ డిస్కషన్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది.
ఈ వీడియోలో పవన్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ మరియు సుభాష్ చంద్రబోస్‌తో హీరోకి ఉన్న కనెక్షన్‌ను చూపిస్తూ సుజీత్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించారు. సాధారణంగా తన సినిమాల గురించి సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని పవన్ కళ్యాణ్.. తాజాగా ఈ వీడియోపై ఎక్స్ వేదికగా స్పందించడం విశేషం. ‘మీరు అడిగారు, మేము విన్నాం. వెల్‌కమ్ టు ది #OGUniverse. #OG2’ అంటూ పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తన సినిమా గురించిన అప్‌డేట్‌పై పవన్ స్వయంగా ఇంత ఎగ్జైట్‌మెంట్‌తో ట్వీట్ చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎప్పుడైనా రెడీ అని పవన్ ఇప్పటికే డైరెక్టర్‌కు స్పష్టం చేశాడు.
You asked, We heard…
Welcome to the #OGUniverse #OG2 ⚔️🌋 https://t.co/5iRZLSS4YM— Pawan Kalyan (@PawanKalyan) June 25, 2026


