పవన్ కళ్యాణ్ కొత్త సినిమా డైరెక్టర్ అతనేనా ?

Published on Feb 26, 2020 1:37 am IST

రాజకీయాలు నుండి సినిమాల్లోకి రావడం రావడంతోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పింక్’ తెలుగు రీమేక్, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న ఆయన వీటి తర్వాత హరీష శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ వచ్చే ఏడాది ఆరంభానికల్లా పూర్తైపోతాయి. అయితే పవన్ 2021లో కూడా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వినిపించడంతో పవన్ కళ్యాణ్ తో సినిమా ఒప్పించడానికి దర్శకనిర్మాతలు ఫుల్ ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పటికే దర్శకుడు డాలీ పవన్ కు ఒక లైన్ చెప్పాడని దాదాపు పవన్ తో అతని సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్నీ కుదిరితే సినిమా ఓకే అయి, 2021 మధ్యలో షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద పవన్ నుండి ఎన్నడూ లేని విధంగా వరుసగా సినిమాలు రానుండటంతో తమ హీరో ఇక సినిమాలే చేయరని నిరుత్సాహపడిన ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :