
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా త్రివిక్రమ్ స్థానమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆయన లవర్ బాయ్ నితిన్‌తో ‘అ..ఆ..’ పేరుతో ఓ రొమాంటిక్ కామెడీని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. నితిన్ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న సరదాగా విచ్చేసి టీమ్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తారు.
పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నితిన్ సెట్స్‌లో పవన్ కనపడగానే ఆనందంలో మునిగిపోయారట. ఇదే విషయాన్ని నితిన్ స్వయంగా తెలియజేస్తూ.. “నిన్న సాయంత్రం సెట్స్‌కి పవర్‌ఫుల్ గెస్ట్ విచ్చేశారు. ఆయన ముందు నటించాలంటే నెర్వస్‌గా, హ్యాపీగా కూడా అనిపించింది” అంటూ ఆయనతో కలిసి దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది.
POWERFUL guest on our sets last nite!!was very nervous excited n happy to perform in front of him:see_no_evil::flushed::blush::smiley::smiley: pic.twitter.com/PQG7C0SBlz
— nithiin (@actor_nithiin) 20 April 2016