లేటెస్ట్ పిక్స్ : ప్రచార రథంతో సిద్దమైన జనసేనాని పవన్ కళ్యాణ్

Published on Dec 7, 2022 5:43 pm IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు. దాదాపుగా చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీలో వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో పవర్ స్టార్ నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక త్వరలో సుజీత్, హరీష్ శంకర్ లతో తన నెక్స్ట్ మూవీస్ చేయడానికి సిద్ధమయ్యారు పవన్.

అయితే అటు సినిమాలతో పాటు ఇటు తన జనసేన పార్టీ తరపున రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన కొనసాగుతున్నారు. అయితే విషయం ఏమిటంటే, అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర చేయనున్నారు. కాగా ఈ యాత్ర కోసం వారాహి పేరుతో ఒక ప్రత్యేకమైన వాహనాన్ని ఆయన సిద్ధం చేయించారు. ఒక చిన్న వీడియో బైట్ ద్వారా ఈ ప్రచార రథం గురించి ట్వీట్ చేసారు పవన్. కాగా యాత్ర మధ్యలో కార్యకర్తలు, నాయకులను కలవడంతో పాటు ప్రజలని కూడా కలిసేందుకు అన్ని రకాల వసతులతో ఆయన దీనిని సిద్ధం చేయించినట్లు తెలుస్తోంది. కాగా పవన్ ప్రచార యాత్ర రథం తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :