త్రివిక్రమ్, థమన్ లతో భీమ్లా నాయక్… సరికొత్త లుక్ లో!

Published on Jul 28, 2021 8:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి మల్టీ స్టారర్ గా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రం కి ప్రొడక్షన్ నెంబర్ 12 గా వర్కింగ్ టైటిల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్ర లో నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ మరియు రానా మేకోవర్ పై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రం షూటింగ్ సెట్స్ లో థమన్, త్రివిక్రమ్ లతో పవన్ కళ్యాణ్ దిగిన ఒక ఫోటో ను చిత్ర యూనిట్ షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ ఫోటో లో పవన్ కళ్యాణ్ పంచకట్టు లో కనిపిస్తున్నారు. థమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ, ది ఎనర్జీ, ది యూఫోరియా అంటూ భీమ్లా నాయక్ ను జత చేశారు. తన దర్శకుడు త్రివిక్రమ్ గారు, మన లీడర్ పవన్ కళ్యాణ్ గారు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :