వైద్యుడి నుంచి కథానాయకుడిగా.. పవన్ మహావీర్ ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ ట్రైలర్ రిలీజ్!

వైద్యుడి నుంచి కథానాయకుడిగా.. పవన్ మహావీర్ ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’ ట్రైలర్ రిలీజ్!

Published on Jul 25, 2026 2:25 PM IST

Amma Naku Aa Abbayi Kavali

జీఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ‘అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి’. శివాల ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథా చిత్రాన్ని శైలజ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాను ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్యతో పాటు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

లండన్‌లో వైద్య విద్యను పూర్తి చేసిన పవన్ మహావీర్ ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. వైద్యుడిగా సేవలు అందిస్తూనే, ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలనే ఆసక్తితోనే నటన వైపు వచ్చినట్లు ఆయన వెల్లడించారు. వర్షిక, సుహానాలు కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు