జస్ట్ పేరు తోనే మంచి హైప్ తెచ్చుకున్న పవన్ చిత్రం.!

Published on Jul 27, 2021 12:04 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇది వరకే 40 శాతం మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి మిగతా షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అన్న నేపథ్యంలో నిన్ననే మేకర్స్ షూట్ స్టార్ట్ చేసినట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే జస్ట్ పవన్ లొకేషన్ ఫోటో మరియు తన రోల్ తాలూకా పేరు “భీమ్లా నాయక్” అనేది రివీల్ చేయడంతోనే ఎనలేని హైప్ దీనిపై నమోదు కావడం గమనార్హం.

ఇది రీమేక్ సినిమా అయినా కూడా వకీల్ సాబ్ లానే టైం గడుస్తున్నా కొద్దీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రివీల్ చేస్తే మంచి హైప్ సెట్టవుతూ వచ్చింది. మరి జస్ట్ పేరుతోనే పవన్ సినిమాపై ఒక్కసారిగా భారీ హైప్ పెరగడం గమనార్హం. దీనితో దర్శకుడు సాగర్ చంద్ర టేకింగ్ పై ఆడియెన్స్ లో మరింత నమ్మకం కుదిరింది. మొత్తానికి మాత్రం భీమ్లా నాయక్ నుంచి సాలిడ్ ఎంటర్టైన్మెంట్ ఖాయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :