ఫిడెల్ క్యాస్ట్రో మరణం పట్ల స్పందించిన పవన్ కళ్యాణ్ !

pawan
క్యూబా మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు అయినా ఫిడెల్ క్యాస్ట్రో మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా స్పందించారు. స్వతహాగా కమ్యూనిస్టు, సామ్యవాద భావాలు కలిగిన పవన్ క్యూబా కమ్యూనిస్టు విప్లవ యోధులు చేగువేరా, ఫిడెల్ క్యాస్ట్రో కు పెద్ద అభిమాని. పవన్ లోని ఆ భావాలే ఆయన్ను అభిమానులకు దగ్గరయ్యేలా చేశాయి. మరీ ముఖ్యంగా చేగువేరాను అయితే దైవంగా ఆరాధిస్తాడు పవన్. అలాంటి గొప్ప నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో 98 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మరణించాడు.

దీని పట్ల పవన్ స్పందిస్తూ ‘గొప్ప నాయకుడు ఫిడెల్ క్యాస్ట్రో ఈరోజుఈ ప్రపంచం నుండి నిష్క్రమించాడు. జనసేన ఆయనకు సెల్యూట్ చేస్తోంది. ఆయన తన సరికొత్త ఆలోచనలతో క్యూబా దేశంలో వైద్య విభాగాన్ని ఛాయా అభివృద్ధి చేశారు. నేను ఆరాధించే చేగువేరాతో ఆయన ప్రయాణం మరువలేనిది. ఆయనెప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ క్యాస్ట్రో పట్ల తన అభిమానాన్ని, భక్తి భావాన్ని చాటుకునాన్డు పవన్.