పవన్ – పూరి సినిమా డిటైల్స్ !

Published on Jan 24, 2021 10:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో కూడా పవర్ స్టార్ నటించబోతున్నారని రీసెంట్ గా రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం పూరి పవన్ కోసం ఒక కథను రెడీ చేశాడని, ఇప్పటికే లైన్ కూడా చెప్పాడని, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని పవన్ పూరికి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో బద్రీ, ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే పూరీ గతంలో మహేష్ బాబుతో చేయాలనుకున్న సినిమా ‘జనగనమణ’. ఈ సినిమా స్క్రిప్ట్ నే పవన్ కి వినిపించాడట. భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథను పూరి రాస్తున్నాడట. అంటే ఈ కథ మొత్తం మన వ్యవస్థలో లోపాల చుట్టూ, అలాగే మన న్యాయ వ్యవస్థలోని డొల్లతనం చుట్టూ కథ సాగుతుందట. 2022లో వీరి కలయికలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :