లేటెస్ట్..భీమ్లా నాయక్ ఎంట్రీ ఈ డేట్ నా..?

Published on Jul 31, 2021 3:03 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి మరో కీలక పాత్రలో ఓ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మళయాళ చిత్రం అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఇప్పటికే సంక్రాంతి రేస్ లో నిలబడనుంది అని మేకర్స్ కన్ఫర్మ్ చెయ్యగా సినీ వర్గాల్లో లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం భీమ్లా నాయక్ ఎంట్రీనే వచ్చే సంక్రాంతికి ఉండనున్నట్టు తెలుస్తుంది. అంటే వచ్చే జనవరి 12 ఈ చిత్రం విడుదల అయ్యే సూచనలు ఉన్నాయని నయా రూమర్. మరి దీనిలో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :