‘పవన్ – రానా’ సినిమా షూట్ మొదలు !

Published on Jul 26, 2021 11:48 am IST

‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ – రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్’ షూటింగ్ ఈ రోజు నుండి మొదలైంది. ఈ షూట్ లో పవన్ కళ్యాణ్ – రానా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులుచేశారు. .

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రలో కొన్ని మార్పులు చేశారట. అయితే, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో ఉన్న రెండు బలమైన పాత్రలలోని ఆ టెంపో ఎక్కడా తగ్గకుండా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. పవన్ పాత్రను పెంచినా.. రానా చేస్తున్న పాత్రకు కూడా తగిన ఇంపార్టెన్స్ ను ఉండేలా మేకర్స్ స్క్రిప్ట్ ను డైజిన్ చేశారట.

సంబంధిత సమాచారం :