సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పవన్ పోరాటం

సపోర్ట్ చేసిన ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పవన్ పోరాటం

Published on Apr 10, 2015 1:41 PM IST

PawanKalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఈ పేరంటే ఓ ప్రభంజనం.. ఒక సినిమా హీరోగానే కాకుండా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా కూడా ప్రజలలోకి దూసుకెళ్తున్నాడు. గత ఎన్నికల్లో ఓట్లు చీలి పోకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మద్దతుని తెలుగు దేశం పార్టీకి మరియు బిజెపి పార్టీకి తెలిపాడు. కానీ తాజాగా తను సపోర్ట్ చేసిన ఏపి తెలుగు దేశం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉద్యమం చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యాడు.

అసలు విషయంలోకి వెళితే.. గత కొద్ది రోజులుగా ఏపి రాజధాని కోసం రైతుల నుంచి భూములను సేకరించే పనిలో ఉన్నారు. కానీ ఆ భూముల వల్ల తమకు నష్టం కలుగుతోందని కొంతమంది రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకారం తెలపలేదు. దాంతో హైకోర్టు భూములు ఇవ్వని రైతుల మీద భూ సేకరణ చట్టం ప్రవేశపెట్టనుందని తీర్పును వెలువరించింది. ఆ వార్తలపై పవన్ స్పందిస్తూ ‘ఈ రోజు మీడియా వార్తలు ప్రకారం(అం.ప్ర) ప్రభుత్వం,రాజధాని కోసం భూములు ఇవ్వని రైతులు మీద భూసేఖరణ చట్టం ప్రయోగించనున్నట్టు హైకోర్టుకి తెలిపారు. ఆ ఉద్దేశం తో ముందుకెల్లితే మటుకు నేను రైతులుకి అండగా పోరాటం చెయ్యడానికి నేను సిద్ధంగా వున్నానని’ ట్వీట్ చేసాడు.

ఈ వార్త మీడియాని మరియు తెలుగు దేశం పార్టీ వారిని షాక్ చేసింది. మరి ఈ విషయం ఎక్కడికి వెళ్లి ముగుస్తుందనేది కాలమే నిర్ణయించాలి. మరో వైపు మే 4 నుంచి గబ్బర్ సింగ్ 2 సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి కూడా పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు