మరో స్థాయికి తీసుకెళ్లే పవన్ “హరిహర వీరమల్లు”

Published on Jul 23, 2021 8:02 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల్లో తన మొట్ట మొదటి భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంపై అంతే స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఎప్పటికప్పుడు పలు ఆసక్తికర అంశాలే బయటకి వస్తున్నాయి.

అయితే ఇప్పటికే ఈ సినిమాపై చాలా విషయాలు తెలిపిన ప్రముఖ స్టార్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఇప్పుడు మరోసారి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా విడుదల అయ్యాక మరోస్థాయిలో ఉంటుంది అని పవన్ అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసే విధంగా ఈ చిత్రం అత్యద్భుతంగా ఉంటుంది అని తెలిపారు.

దీనితో ఈ సినిమా అంచనాలు మరింత అయ్యాయి. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :