షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Published on Feb 20, 2020 11:15 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేటి ఉదయం ఢిల్లీకి వెళ్లారు. భారత జవాన్ల సహాయార్థం ఆయన ఇవ్వదలచిన కోటి రూపాయల చెక్ స్వయంగా అధికారులకు అందజేయనున్నారు. నేటి ఉదయం ఆర్.కె.పురం లోని కేంద్రీయ సైనిక్ బోర్డుకి వెళ్ళి , అక్కడ సైనిక అధికారులకు కోటి రూపాయలు చెక్కు అందజేస్తారు. అలాగే ఢిల్లీ లోని బీజేపీ ప్రధాన నాయకులతో ఆయన కలవనున్నారు. ఈనేపథ్యంలో పవన్ షూటింగ్ కి షార్ట్ బ్రేక్ ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేడు మరియు రేపు కూడా కొనసాగనున్న తరుణంలో ఆయన తిరిగొచ్చిన తరువాత షూటింగ్ లో పాల్గొంటారు. కనుక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పింక్ రీమేక్ చిత్రీకరణతో పాటు, దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ చిత్రీకణకు కూడా ఆయన విరామం ప్రకటించారు. ఇక పవన్ పింక్ రీమేక్ లో లాయర్ పాత్ర చేస్తుండగా, మే లో ఈ చిత్రం విడుదల కానుంది. పవన్ దర్శకుడు హరీష్ శంకర్ తో కమిట్ అయిన మరో చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.

సంబంధిత సమాచారం :