పవన్ కొత్త ఒప్పందం.. లాభాల్లో షేర్ ?

Published on Apr 22, 2021 11:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నారు. పారితోషకం కూడ భారీగానే పుచ్చుకుంటున్నారు. ఒక్కొక సినిమాకు ఆయన 50 కోట్ల వరకు అందుకుంటున్నట్టు తెలుస్తోంది. 50 కోట్లు కాకపోతే రోజుకు కోటి చొప్పున ఛార్జ్ చేసే పద్దతిని కూడ అవలంభిస్తున్నారట. అంటే సినిమాకు ఎన్ని రోజులు వర్క్ చేస్తే అన్ని కోట్లు చెల్లించాలన్నట్టు. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చినా కూడ పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం, బిజినెస్ వర్గాల్లో ఆయన సినిమాలకు డిమాండ్ చెక్కుచెదరకపోవడంతో నిర్మాతలు సైతం అంత భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నారు.

కేవలం రెమ్యునరేషన్ మాత్రమే కాదు లాభాల్లో కూడ షేర్ తీసుకుంటున్నారట పవన్. ఆయన తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ విషయంలో ఇదే జరిగిందట. ఈ సినిమాకు గాను పవన్ 50 కోట్ల పారితోషకం తీసుకోవడంతో పాటు వచ్చే లాభాల్లో షేర్ కూడ తీసుకున్నారని టాక్. నిర్మాత దిల్ రాజు సినిమాను నైజాం హక్కులను తనవద్దనే ఉంచుకుని మిగతా అన్ని ఏరియాల్లో భారీ ధరలకే విక్రయించారు. సినిమా చాలా ఏరియాల్లో మంచి షేర్ రాబట్టింది. నైజాం వసూళ్ళలో దిల్ రాజుకు లాభాలు కనిపించాయట.

అంతేకాదు హక్కుల విక్రయం ద్వారా మంచి మొత్తమే మిగిలిందట. ఆ లాభాల నుండి పవన్ కు 15 కోట్ల వరకు షేర్ ఇచ్చారట. అంటే ‘వకీల్ సాబ్’ ద్వారా పవన్ అందుకున్న మొత్తం 65 కోట్లకు చేరింది. మరి ఈ ఒక్క సినిమాకే పీకే లాభాల్లో షేర్ తీసుకున్నారా లేకపోతే అన్ని సినిమాలకు ఇలాగే తీసుకుంటున్నారా చూడాలి.

సంబంధిత సమాచారం :