కరోనా తగ్గినా పవన్ పరిస్థితి అలానే ఉందట

Published on Apr 27, 2021 5:41 pm IST

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. లక్షణాలు కనిపించడంతో కొన్నిరోజులు క్వారంటైన్లో ఉన్న ఆయన పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకున్నారు. ఒక వ్యక్తిగత వైద్యుడు, అపోలో వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షించి వైద్యం అందించారు. దీంతో పవన్ చాలా త్వరగానే వైరస్ బారి నుండి కోలుకున్నారు. ఇటీవల పరీక్షల్లో ఆయన నెగెటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.

అయినా పవన్ ఇంకా బలహీనంగానే ఉన్నారట. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ శివార్లలో ఉన్న తన ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ఆయన మునుపటి పరిస్థితికి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందట. పైగా బయట పరిస్థితులు కూడ బాగోలేవు. ఇప్పటికే ఇండస్ట్రీ దాదాపు పూర్తిగా స్తంభించిపోయింది. షూటింగ్స్ జరగట్లేదు. దీంతో పవన్ ఇంకో రెండు వారాలు విశ్రాంతిలోనే ఉండనున్నారు. అంటే ఆగిపోయిన ఆయన రెండు సినిమాలు రీస్టార్ట్ కావాలంటే ఇంకో నెల రోజులు పట్టేలా ఉంది.

సంబంధిత సమాచారం :