“వకీల్ సాబ్”తో చాలా కాలం తర్వాత పవన్ మార్క్ సాంగ్.?

Published on Mar 2, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పటికి చేసింది కొన్ని సినిమాలే అయినా తన సినిమాలకు అంటూ ఒక స్పెషల్ బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్నారు. అయితే పవన్ చేసిన అన్ని సినిమాలను కూడా గమనిస్తే సామాజిక అంశాలపై ఖచ్చితంగా ఏదో ఒక పాట ఉంటుంది.

బద్రి, జానీ, ఖుషి, జల్సా వరకు ఇలా ఎన్నెన్నో సినిమాల్లో పవన్ తనకు సమాజం పట్ల ఉన్న దృక్పథాన్ని వ్యక్త పరిచే ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందుకే పవన్ సినిమాలు కాస్త స్పెషల్ గానే అనిపిస్తాయి. అయితే మళ్ళీ పవన్ నుంచి అలాంటి స్పెషల్ సాంగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది.

కానీ ఇప్పుడు “వకీల్ సాబ్”లో అలాంటి సాంగ్ ఉండడం ఖాయమనేలా తెలుస్తుంది. కొన్ని రోజులు నుంచి అనుకుంటున్నా సెకండ్ సింగిల్ “సత్యమేవ జయతే” అన్నట్టుగానే ఓ పక్క థమన్ సస్పెన్సును కొనసాగిస్తుండగా సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఓ పోస్ట్ ను పెట్టారు.

జాతీయ జెండాతో నాలుగు సింహాలు కలిపి ఉన్నది చూస్తే మళ్ళీ పవన్ నుంచి ఒక బ్లాక్ బస్టర్ దేశ భక్తి గీతం రావడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ ఎలా డిజైన్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :