కొత్త ఇంటికి భూమి పూజ చేయనున్న పవన్ కళ్యాణ్ !
Published on Mar 11, 2018 8:07 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నవ్యాంధ్రలోని గుంటూరు సమీపాన నూతన గృహాన్ని నిర్మించుకోనున్నారు. దీనికిగాను రేపు ఉదయం స్థలా ప్రాంగణంలో భార్య అన్న లెజినోవాతో కలిసి భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు.

నూతనంగా నిర్మించనున్న ఈ కొత్త ఇంటి నుండే పవన్ జనసేన కార్యకలాపాల్ని పర్యవేక్షించనున్నారు. మరోవైపు మార్చి 14న గుంటూరులో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్ని కూడ భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ పెద్దలు, క్యాడర్ ఏర్పాట్లను చేస్తున్నారు. ఇకపోతే సినిమాలు పరంగా పవన్ కళ్యాణ్ తర్వాతి అడుగు ఏమిటనే దానిపై ఇంకా పూర్తిస్థాయి క్లారిటీ రాలేదు.

 
Like us on Facebook