అన్నయ్యకు విషెస్ చెప్పిన పవన్ కళ్యాణ్!
Published on Jan 7, 2017 2:02 pm IST

pawan
మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నెం 150’ ప్రీ రిలీజ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మెగా అభిమానులంతా మెగా ఫ్యామిలీ ఒకే వేదిక పైకి చేరి చిరంజీవికి వెల్కమ్ చెబితే చూడాలని తహతహలాడిపోతున్నారు. ఈ నైపథ్యంలో పవన్ ఖైదీ టీమ్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడం మరింత చర్చనీయాంశంగా మారింది.

‘చరణ్, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న మొదటి చిత్రం అన్నయ్య నటించిన ఖైదీ నెం 150 కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు’ అంటూ విషెస్ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ అంతా విషెస్ చెప్పడం వరకు బాగానే ఉంది వేడుకకు వస్తున్నాడో రావట్లేదో కూడా చేప్పేసుంటే బాగుండేదని, ఇప్పుడింకా టెంక్షన్ ఎక్కువైందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.

 
Like us on Facebook