పవన్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కి పండగే!

pawan-kal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 2న తన పుట్టినరోజు జరుపుకోనున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిసారిలానే ఈసారి కూడా పవన్ అభిమానులంతా పెద్ద ఎత్తున ఈ వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. ఇదిలా ఉంటే వీరి ఉత్సాహాన్ని మరింత పెంచేలా దర్శకుడు డాలీ, పవన్ అభిమానులకు ఓ గిఫ్ట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తోన్న డాలీ, ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను, టైటిల్‌ను పవన్ పుట్టినరోజున విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఓ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించనుండడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్న అభిమానులకు, ఫస్ట్‌లుక్ వార్త ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమా షూట్‌లో మరో రెండు వారాల్లో పవన్ పాల్గొంటారు. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ఫస్ట్‌లుక్ విషయమై టీమ్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.