పాయల్ పై వచ్చిన వార్తలన్నీ పుకార్లేనట..!

Published on Jul 5, 2020 1:27 pm IST

హాట్ బ్యూటీ పాయల్ కొన్నిరోజులుగా తనపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టింది. ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని తెలియజేసింది. పాయల్ కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2, బన్నీతో సుకుమార్ చేస్తున్న పుష్ప చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదని, ఆ రెండు చిత్రాలలో తనకు ఐటెం సాంగ్స్ ఆఫర్స్ రాలేదని తెలియజేసింది.

టాలీవుడ్ లో ఆమె లేటెస్ట్ రిలీజ్ డిస్కో రాజా సైతం సరైన విజయం అందుకోలేదు. ఐతే గత ఏడాది వెంకటేష్ సరసన చేసిన వెంకీ మామ మంచి విజయం అందుకుంది. పాయల్ ప్రస్తుతం తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. అలాగే కామెడీ హారర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఓ తమిళ చిత్రంలో కూడా పాయల్ నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More