హుషారు హీరో తో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ !

Published on Feb 21, 2019 4:51 pm IST

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హుషారు చిత్రంలో ఒక హీరోగా నటించాడు నటుడు తేజస్ కంచెర్ల. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యూత్ ను మెప్పించింది. ఇక ఈ చిత్రం తరువాత తేజస్ మరో సినిమాకి సైన్ చేశాడు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనునున్నాడు. ఇక ఈ చిత్రంలో సెన్సేషనల్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించనుంది. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రపీ అందించనున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

ఇక ఆర్ఎక్స్ 100 తరువాత కొంత గ్యాప్ తీసుకున్న పాయల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేసింది. అందులో డిస్కో రాజా , వెంకీమామ లాంటి చిత్రాలు వున్నాయి.

సంబంధిత సమాచారం :