పెద్ద హీరోలకు మంచి ఛాయిస్‌గా మారిన హీరోయిన్ !

Published on May 17, 2019 2:00 am IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కెరీర్ వేరే స్థాయిలో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంత పెద్ద హిట్ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయినా పాయల్ ఓపిగ్గా ఎదురుచూసింది. ఆమె ఎదురుచూపులు ఫలించి ఇప్పుడిప్పుడే సినిమాలు వస్తున్నాయి. అయితే అవి యువ హీరోల సినిమాలు కాదు. సీనియర్ హీరోల సినిమాలు.

లుక్స్ పరంగా కొంచెం పెద్ద తరహాలో కనబడే పాయల్ సీనియర్ హీరోలకు మంచి జోడీ అవుతుందని భావిస్తున్నారు దర్శకులు. అందుకే సీనియర్లతో సినిమా చేయాలనుకునే వారంతా ఆమెను సంప్రదిస్తున్నారు. ప్రస్తుతం ‘వెంకీ మామ’లో విక్టరీ వెంకటేష్ సరసన నటిస్తున్న ఆమె రవితేజతో కలిసి ‘డిస్కో రాజా’లో నటిస్తోంది. ఈ రెండూ కాకుండా మరొక సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ త్వరలో స్టార్ట్ చేయనున్న కె.ఎస్.రామారావు సినిమాలో సైతం పాయల్ ఛాన్స్ దక్కించుకుందట. మొత్తానికి కుర్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు రాకపోయినా పెద్ద హీరోలకు ఓన్లీ ఛాయిస్‌గా మారడం పాయల్ కెరీర్లో గొప్ప మలుపనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More