“టైగర్ నాగేశ్వరరావు” కథలో విలన్ ఎవరంటే ?

Published on Jun 9, 2019 12:52 pm IST

ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌పురానికి చెందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్, నాగేశ్వర రావు గా కనిపించనున్న విషయం తెలిసిందే. దర్శకుడు వంశీ కృష్ణ ఎప్పటినుండో ఈ ప్రాజెక్ట్ పై కసరత్తు చేస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు 70వ దశకంలో దోపిడీలు, దొంగతనాలు చేసి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆయన పేరు చెబితేనే పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి. టైగర్ నాగేశ్వరరావు గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకొనేవారు.

టైగర్ నాగేశ్వరరావు పోలీసు కి పట్టుపడటానికి ఆయనతో సన్నిహిత సంబంధం కలిగిఉన్న ఓ వేశ్య మహిళే కారణం అనేది స్థానిక ప్రజలు చెప్పే మాట. పోలీసుల తో కుమ్మకైన ఆమె నాగేశ్వరరావు కి మత్తు మందు ఇచ్చి ఆయన దొరికిపోయేలా చేసిందని అందరు చవుతుంటారు. పాయల్ రాజపుత్ ఈ మూవీలో వేశ్య పాత్ర చేయనున్నారని తెలుస్తున్న తరుణంలో ఈ మూవీకి విలన్స్ పాయల్ రాజపుత్ మరియు పోలీసులే అని తెలుస్తుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేణు దేశాయ్ ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ అక్కగా కనిపించనున్నారట.

సంబంధిత సమాచారం :

More