సోషల్ మీడియా ట్రోలింగ్.. అప్సెట్ అయిన హాట్ బ్యూటీ

Published on Sep 30, 2020 2:07 am IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి పాయల్ రాజ్ పుత్ ఆ తరవాత తెలుగులో వరుస సినిమాలకు సైన్ చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్స్ ఇపుడిప్పుడే మొదలవుతున్నాయి. దీంతో పాయల్ చేస్తున్న సినిమా కూడ మొదలైంది. అయితే మొదటిరోజు షూటింగ్ స్పాట్ నందు అందరికీ కొవిడ్ స్వాబ్ టెస్ట్ నిర్వహించారు చిత్ర బృందం. అందరితో పాటు నటి పాయల్ కు కూడ టెస్ట్ నిర్వహించారు. పరీక్ష చేయించుకునే సమయంలో పాయల్ చాలా భయపడింది. దాదాపు ఏడ్చేసినంత పని చేసింది. ఆ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరీక్ష చేసేటప్పుడు చాలా భయపడ్డానని, ఆ ఐదు సెకన్లు బాగా ఇబ్బంది పడ్డానని, చివరకు నెగెటివ్ వచ్చిందని తెలిపింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలామంది కొవిడ్ పరీక్షకు మరీ ఇంతలా భయపడాలా, ఇది ఓవరాక్షన్, అంత అవసరం లేదు అంటూ రకరకాలుగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఊహించని ఈ పరిణామానికి పాయల్ ఖంగుతింది. వెంటనే స్పందిస్తూ నటించాల్సిన అవసరం తనకు లేదని, నిజంగానే భయపడ్డానని అంటూ తనకు మందులు, ఇంజెక్షన్లు అంటే చాలా భయం. కరోనా టెస్ట్ మరీ ఇబ్బందికరంగా అనిపించింది. అందుకే భయపడ్డాను. దీనికే నన్ను ట్రోల్ చేయాలా, దయచేసి ట్రోలింగ్ ఆపండి అంటూ స్పందించింది. ప్రస్తుతం పాయల్ తెలుగుతో పాటు తమిళంలో కూడ ఒక సినిమా చేస్తోంది.

సంబంధిత సమాచారం :

More