టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేస్తోన్నాడు. శర్వానంద్ తన కెరీర్ లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా అదితి రావు హైదరి నటించబోతుంది. అజయ్ ఇప్పటికే అదితి రావు హైదరికి కథ కూడా వివరించారు. అదితి రావు హైదరి కూడా ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తిగా ఉందట.
కాగా సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలకు వస్తే.. సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి తదితరులు నటిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.


