పాయల్ కు ఆ స్టార్ హీరోలతో నటించాలని ఉందట !

పాయల్ కు ఆ స్టార్ హీరోలతో నటించాలని ఉందట !

Published on Jul 19, 2018 7:51 PM IST

‘ఆర్ఎక్స్100’తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైయ్యారు పంజాబీ అమ్మాయి పాయల్ రాజ్ పుత్. ఇక ఇటీవల విడుదలైన ఈచిత్రం ఊహించనిరీతిలో వసూళ్లను రాబడుతూ బ్లాక్ బ్లాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధిచడం లో హీరోయిన్ పాయల్ కూడా ముఖ్య పాత్రను పోషించింది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా తన పాత్రలో అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తురువాత ఆమెకు మీడియం రేంజ్ హీరోల సరసన అవకాశాలు రావడం ఖాయం గా కనిపిస్తుంది.

అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీరు ఏ హీరోలతో కలిసి నటించాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించాలని ఉందని అన్నారు. . పవన్ కళ్యాణ్ సినిమాలు తగ్గించేసాడు కాబట్టి మరి మహేష్, ప్రభాస్ లలో ఎవరు పాయల్ కు ఛాన్స్ ఇస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు