డిఫ్రెంట్ రోల్ లో పాయల్ !

డిఫ్రెంట్ రోల్ లో పాయల్ !

Published on Dec 18, 2018 2:00 PM IST

‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సషనల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇక ఈ చిత్రం తరువాతఆ ఆమె సెలెక్టీవ్ గా సినిమాలను ఎంచుకుంటుంది. తాజాగా పాయల్, మాస్ మహారాజ్ రవితేజ నటించనున్న ‘డిస్కో రాజా’ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రంలో పాయల్ ద్రుష్టి లోపం అలాగే వినికిడి లోపం వున్న అమ్మాయి పాత్రలో నటించనుందని సమాచారం. ఓన్లీ గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా గుర్తింపు వున్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని భావిస్తుంది ఈ హీరోయిన్.

‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫేమ్ వి ఐ ఆనంద్ తెరకెక్కించనున్న ఈచిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల వరస ప్లాప్స్ తో సతమతవుతున్న రవితేజ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు